FbTelugu

లోయలో పడ్డ కారు.. ఐదుగురు మృతి

జమ్ము కశ్మీర్ : ప్రమాదవశాత్తూ కారు లోయలో పడి ఐదుగురు మృతి చెందిన దారుణ ఘటన జమ్ముకశ్మీర్ లోని దోడా జిల్లా రగ్గీనాల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఓ కారు ప్రమాదవ శాత్తు లోయలో పడిపోయింది.

ఆ లోయలో నీరు ప్రవహిస్తూ ఉండడంతో నీటిలో ఆ కారు మునిగింది. ఈ ఘటనలో కారులోని ఐదరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు గుర్తించారు.

You might also like