FbTelugu

కారు బీభత్సం.. ఇద్దరి పరిస్థితి విషమం

అమరావతి: తాడేపల్లి దగ్గర గుంటూరు వెళ్లే రోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అటుగా వచ్చిన ఓ బైకును కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైనాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. కారును ఓ యువతి డ్రైవ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like