FbTelugu

చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

రాయచూర్: అదుపు తప్పి ఓ కారు చెట్టును బలంగా ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెంది, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా, కోటిదొడ్డి మండలానికి చెందిన హనుమంతు కుమారుడు గోపాల్‌.

ఇతడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా లాక్ డౌన్ నేపథ్యంలో తన స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గోపాల్‌, అతని కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.

You might also like