FbTelugu

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

నల్లగొండ: ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ కారు.. వేగంగా వచ్చి ఆగివున్న లారీనీ ఢీకొట్టింది.

ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు గీతాలక్ష్మి, శ్రీనివాస్, లక్ష్మీచంద్ర గా గుర్తించారు. కాగా ఈ ప్రమాదంలో ముగ్గరు చిన్నారులు క్షేమంగా బయటపడ్డట్టు తెలిపారు.

You might also like