FbTelugu

కారు బీభత్సం.. ఇద్దరు మృతి

నిజామాబాద్: అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి జనాలపై దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెంది, ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని భీంగల్ మండలం, బడాభీంగల్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

స్థానిక బడాభీంగల్ లో ఓ కారు అతివేగంగా వచ్చి అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. అక్కడి నుంచి పక్కనే ఉన్న హోటల్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడి కక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.