FbTelugu

రాజేంద్రనగర్ లో కారు బీభత్సం

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును నడపడంతో.. ఆ కారు ఓ బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న శ్రీనివాస్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ప్రమాదం అనంతరం కారును నడిపిన వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కారుని సీజ్ చేసి, నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

You might also like