FbTelugu

ఇంకెంతకాలం రాజధానుల మార్పు: పరకాల ప్రభాకర్

* అమరావతి ఆందోళనలపై డాక్యుమెంటరీ

అమరావతి: ‘రాజధాని విషాదం-అమరావతి’ అనే పేరుతో ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. డాక్యెమెంటరీని నిన్న(ఆదివారం) హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రదర్శించారు. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ.. రైతులు, ఇతర ప్రజలు సుదీర్ఘకాలంగా చేపడుతున్న ఆందోళనల నేపథ్యంలో పరకాల ప్రభాకర్ ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి ఉద్యమం గురించి సమగ్రంగా అధ్యయనం చేసి డాక్యుమెంటరీ రూపొందించినట్టు తెలిపారు. ఈ డాక్యుమెంటరీ ద్వారా రైతుల ఆందోళనను ప్రపంచానికి తెలియజేయనున్నట్టు తెలిపారు. ఈ డాక్యుమెంటరీలో ఏపీ రాజధానులు ఇంకెంత కాలం మార్చుకోవాలంటూ ప్రశ్నించారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి రాజధానులు ఉన్నాయని, కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రాజధాని ఏదో తెలియని మీమాంశలో ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.