FbTelugu

రోజుకు 36వేల పరీక్షల సామర్థ్యం: ఏపీ మంత్రి

అమరావతి: కరోనా విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక పరీక్షలు చేస్తూ రికార్డు సృష్టించామని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి తెలిపారు.
రోజుకి 36,047 పరీక్షలు చేసే సామర్థ్యాన్ని ఇప్పటికే సాధించి ఏపీ రికార్డు నెలకొల్పిందన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చేసిన కరోనా పరీక్షల మొత్తం సంఖ్య 10 లక్షలకు చేరిందని ఆయన పేర్కొన్నారు.

సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకుని ఏపీ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని నియంత్రించే స్థాయికి తీసుకొచ్చిందని మంత్రి గౌతమ్ అన్నారు. త్వరలోనే కరోనాను జయిస్తాం.. అందరూ ఇళ్లలోనే, సురక్షితంగా ఉండాలి అని మేకపాటి గౌతమ్‌ రెడ్డి కోరారు.
కాగా, ఏపీలో మొదటి నుంచి అత్యధిక పరీక్షలు చేస్తోన్న విషయం తెలిసిందేనన్నారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 18,697గా ఉందని ఆయన వివరించారు.

You might also like