FbTelugu

స్థానిక ఎన్నికలపై స్టే కుదరదు: ఏపీ హైకోర్టు

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదలకు స్టే ఇవ్వడం సాధ్యం కాదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలిపివేయడం చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఫిబ్రవరిలో జరిగే స్థానిక ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ ఏప్రీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ పై విచారించిన హైకోర్టు పై విధంగా స్పందించింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 14 కు వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.