FbTelugu

కూల్చివేతపై జోక్యం చేసుకోలేము: సుప్రీంకోర్టు

ఢిల్లీ: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సచివాలయంలో భవనాల కూల్చివేతపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు జస్టిస్ అశోక్ భూషన్, జస్జిస్ ఎస్.కె కౌల్, జస్టిస్ ఎం.ఆర్ షా తో కూడిన ధర్మాసనం విచారించింది. జూన్ 29వ తేదీన తెలంగాణ హైకోర్టు కూల్చివేసేందుకు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్ రెడ్డి తన పిటీషన్ లో కోరారు.

You might also like