FbTelugu

స్పుత్నిక్-వి ఇప్పట్లో దొరకదా?

హైదరాబాద్: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తయారు చేస్తున్న స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఇప్పట్లో మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. ఈ నెల మొదట్లో మార్కెట్ కి వస్తుందని ప్రచారం జరిగి రెండో వారానికి వాయిదా పడింది.

అది కాస్తా జూలై 1 కి వాయిదా పడింది. ఇంకా అనుమతులు రాకపోవడంతో ఇప్పట్లో మార్కెట్ లోకి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. బహిరంగ మార్కెట్ లోకి విడుదల చేసే ముందు కసౌలి లోని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబోరేటరీ (సిడిఎల్) కు స్పుత్నిక్-వి నమూనాలను పంపించారు. ల్యాబ్ నుంచి అనుమతులు వస్తే తప్ప మార్కెట్ లోకి అనుమతించే అవకాశాలు లేవు. అయితే గత నెల నుంచి రెడ్డీస్ ల్యాబ్ సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. సెంట్రల్ డ్రగ్స్ ల్యాబోరేటరీ నుంచి అనుమతులు రానందున విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది.
అనుమతులు లభించిన వెంటనే దేశంలోని 29 నగరాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చామని, ఇందుకోసం కోల్డ్ స్టారేజీలను కూడా సిద్ధం చేసినట్లు తెలిపింది. దేశంలో కరోనా కేసులు విజృంభిస్తుండడంతో రష్యా దేశం నుంచి 50 లక్షల డోసులు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించి ఇప్పటి వరకు 30 లక్షల డోసులు దిగుమతి చేసుకున్నది. మిగిలిన 20 లక్షల డోసులు ఈనెలాఖరుకు హైదరాబాద్ కు చేరుకోనున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.