FbTelugu

పవన్ కోసం నిబంధనలు మార్చం: మంత్రి నాని

తిరుపతి: జనసేన అధినేత, హీరో కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కోసం నిబంధనలు మార్చరని తెలుసుకోవాలని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. టికెట్ రేట్లు పెంచి జనం జేబులు కొట్టాలా? అని ప్రశ్నించారు.

మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం 4 షోలకే అనుమతి ఉందన్నారు. వకీల్ సాబ్ సినిమా హిట్ కి.. ఎన్నికలకు సంబంధం ఏంటి? అని అడిగారు. ఏపీ కి సాయం చేయమని అడిగితే చేతిలో ఉమ్మేసిన బిజెపి కి ఎందుకు ఓటేయాలని 2014లో పవనే అడిగారన్నారు. రాష్ట్రాన్ని రెండుగా చీల్చింది కాంగ్రెస్, బీజేపీయేనని పవన్ అనలేదా? అని నిలదీశారు. విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు.. అందుకు ఓటేయాలా? అని నాని అన్నారు.

ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయాలి అని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వం పాచిపోయిన లడ్డూలు పెట్టిందని పవనే చెప్పారన్నారు. బీజేపీ నేతలు చెప్పిన అచ్చేదిన్ ఎక్కడ వచ్చిందో చెప్పాలి. చంద్రబాబు తనకు తానే భజన చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈరోజు వీధి వీధి తిరుగుతున్నారు. సీఎం జగన్ సభలో మాట్లాడతానంటేనే.. చంద్రబాబుకు వణుకుపుడుతోందన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.