FbTelugu

కనీసం డ్రైనేజీలను ఏర్పాటు చేయలే: ప్రకాశ్ జవదేకర్

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరేళ్లయినా.. హైదరాబాద్ లో కనీసం డ్రైనేజీలను ఏర్పాటు చేయలేదని బీజేపీ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కేసీఆర్ కుటుంబ ఆస్తులే పెరుగుతున్నాయని.. ప్రజల బ్రతుకులు ఏమీ మారలేదని అన్నారు. నగరంలో వర్షం పడితే.. 15 రోజులు ఇళ్లనుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు నగరాన్ని ప్లడ్ సిటీగా మార్చారన్నారు. డబుల్ బెడ్రూంలంటూ.. లక్షఉద్యోగాలంటూ ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.