FbTelugu

పట్టుబడిన రూ.2 కోట్ల విలువైన గంజాయి

విశాఖపట్నం: పోలీసు తనిఖీల్లో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టుబడిన ఘటన జిల్లాలోని పాడేరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాడేరులోని పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా.. కొందరు దుండగులు సుమారు రూ.2 కోట్ల విలువైన 20 క్విటాళ్ల గంజాయిని తరలిస్తుండగా.. పట్టుబడింది.

నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అలాగే చోడవరంలో ఓ కంటైనర్ లో 400 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్లుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.