FbTelugu

శానిటైజర్ రూపంలో గంజాయి లిక్విడ్

* గంజాయి మాఫియా నయా దందా

గుంటూరు: జిల్లాలో గంజాయి మాఫియా నయా దందా మొదలు పెట్టింది. శానిటైజర్ రూపంలో గంజాయి లిక్విడ్ ను తయారు చేసి యథేచ్చగా చలామణి చేస్తున్న 8మంది గల ఓ ముఠా పోలీసులకు పట్టుబడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు దుండగులు శానిటైజర్ డబ్బాల్లో గంజాయి లిక్విడ్ పోసి అక్రమంగా సరఫరా చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like