FbTelugu

పెళ్లికి ఒప్పుకోలేదని గంజాయి కేసు!

తిరువనంతపురం: పెళ్లికి నిరాకరించడంతో ఒక మహిళను గంజాయి కేసులో ఇరికించి నానా ఇబ్బందుల పాలు చేశాడు. ఈ కేసు నుంచి బయట పడేందుకు ఆమె ఎంతో పోరాడాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తిరువనంతపురంలో ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త శోభా విశ్వనాథ్ కు నగరంలోని లార్డ్స్ హాస్పిటల్ సిఈఓ హరీశ్ హరిదాస్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువుకు కూడా ఏర్పడ్డంతో అతను పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు.

ఆమె కుదరదని చెప్పి, దూరం జరిగింది. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న హరీశ్ ఆమెను ఎలాగైనా సరే బదనాం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమె వద్ద పనిచేసే వివేక రాజ్ ను ఇంటికి పిలిపించుకున్నాడు. అతని తో ఆమె ఇంట్లో గంజాయి పెట్టించి, పోలీసులకు ఫోన్ చేయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. తను అలాంటి దాన్ని కాదని, గంజాయి అంటే తనకు తెలియదని నెత్తినోరు కొట్టుకున్నా పోలీసులు విన్పించుకోలేదు. తనకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కు ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశం మేరకు క్రైం బ్రాంచి పోలీసులు విచారించి, ఆమెను నిర్ధోషిగా తేల్చడంతో బయటపడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.