FbTelugu

బిజెపి దెబ్బకు ఇతర దేశాలకు అభ్యర్థులు

గౌహతి: అస్సాంలో ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే రాజకీయాలు మహా రంజుగా ఉన్నాయి. పోలింగ్ ముగియగానే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను రాష్ట్రం నుంచి బయటకు పంపించాయి.

అధికార బిజెపి నుంచి కొనుగోళ్ల సమస్య ఉందని భావించిన కాంగ్రెస్, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీలే అప్రమత్తమయ్యాయి. అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ ఏప్రిల్ 6న నిర్వహించారు. 126 సీట్లకు మే 2వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను పోలింగ్ పూర్తయిన మరుక్షణమే రాష్ట్రం నుంచి రాజస్థాన్ కు తరలించింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో అక్కడ సురక్షితం అని రిసార్ట్ లకు పంపించారు. కౌంటింగ్ వరకు జైపూర్ శివారు రిసార్ట్ లలోనే ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం హుకుం జారీ చేసింది. రిసార్టుల చుట్టూ రాజస్థాన్ ప్రభుత్వం పోలీసులను భధ్రతగా పెట్టింది.
కాగా బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. 11 మంది అభ్యర్థులు పోటీ చేయగా 10 మంది అభ్యర్థులను విదేశాలకు పంపించింది. బిజెపికి మెజారిటీ తగ్గుతుందని, అలా అయితే కొనుగోళ్లకు తెరలేపుతారనే ఉద్దేశ్యంతో ఈ చర్య తీసుకున్నారు. 10 మందిని సింగపూర్ కు పంపించింది. ఈ విషయాన్ని మంత్రి ప్రమీలా రాణి ధృవీకరించారు. ఆ పార్టీ అభ్యర్థులు విదేశాలకు వెళ్లారు, ఎక్కడకు వెళ్లారనేది తెలియదంటూ తెలిపారు. వారికి మేము ఫోన్ చేయలేదని, ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరతీయదని మేము భావించడం లేదని ప్రమీల వ్యాఖ్యనించడం విశేషం.

You might also like

Leave A Reply

Your email address will not be published.