FbTelugu

అమరావతి లో రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఎత్తివేత!

గుంటూరు: అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపు నెమ్మదిగా మొదలుపెట్టారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు అవుతున్న విషయం తెలిసిందే.

కొద్ది నెలలుగా అమరావతి ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలు పూర్తిగా మందగించాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. దీనికి తోడు రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు ఆమోదం లభించడంతో మరింతగా పరిస్థితి దిగజారింది. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎత్తివేతకు రంగం సిద్ధమైంది.

గత ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో నాలుగు చోట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మందడం, తుళ్ళూరు, అనంతవరం, ఉండవల్లి గ్రామాలలో ఆఫీసులు కొనసాగుతున్నాయి. రాజధాని తరలింపు నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ప్రభుత్వం ఎత్తివేసేందుకు ఆదేశాలు జారీచేయనున్నది.

You might also like