FbTelugu

కాపు ఉద్యమ కేసులు ఎత్తివేత

అమరావతి: కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించి తుని రైల్వే ఘటనలో మరో 17 కేసులల్లోనూ విచారణను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన 17 కేసులను ఉపసంహరిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ డీజీపీ సిఫార్సుల మేరకు ఈ కేసులను ఉపసంహరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నమోదైన 69 కేసులకు గాను ఇప్పటికే 51 కేసులను గత ఏడాది ఉపసంహరించుకున్నది.

You might also like