FbTelugu

మూడు నెలలు బియ్యం తీసుకోకపోతే కార్డు రద్దు

హైదరాబాద్: రేషన్ దుకాణాలల్లో వరసగా మూడు నెలలు బియ్యం తీసుకోకపోతే దానికదే  రేషన్ కార్డు రద్దు అవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఇవాళ శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు గంగుల పై విధంగా సమాధానం ఇచ్చారు.

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగానే కొత్తకార్డులు ఇవ్వలేకపోయామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డుల కోసం 9,41,641 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 3,59,974 మందికి తెల్లకార్డులు కాకుండా ఆహార భద్రతా కార్డులు జారీ చేశామన్నారు. అర్హత లేని 92 వేల దరఖాస్తులను తిరస్కరించామని, 4,88,775 కార్డుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని అన్నారు. గడచిన మూడేళ్లలో హైదరాబాద్‌లో 44 వేల 734 కార్డులు ఇచ్చామని, మరో 97 వేల కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి కమలాకర్ వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.