FbTelugu

ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు: సురేష్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మాదిరే ఏపీలో కూడా టెన్త్ క్లాస్ పరీక్షలు రద్దు చేశారు. ఇవాళ  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

రాష్ట్రంలో ఈసారి కూడా తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని అనుకున్నామని ఆయన అన్నారు. కరోనా నేపథ్యంలో పరీక్ష విధానంలో మార్పులు చేసి, 11 పేపర్లు బదులు ఆరు పేపర్లు పెట్టాలని అనుకున్నామన్నారు. భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష కేంద్రాలు కూడా పెంచామన్నారు. అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని మంత్రి వివరించారు.

విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. పరీక్షల నిర్వహణ, సమస్యలు, తలెత్తే పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రద్దు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కరోనా ప్రబలుతున్న సమయంలో ఏ తల్లి తన బిడ్డ ఆరోగ్యం గురించి బెంగపెట్టుకోకూడదని సీఎం జగన్ చెప్పారన్నారు.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు…

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నామని ఆయన తెలిపారు. కొద్ది మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నా, వారి శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.