FbTelugu

ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు?

హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. మంగళవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఇంటర్ పరీక్షలపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారని తెలిసింది.

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి, థర్డ్ వేవ్ ముప్పు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం కన్నా రద్దు చేయడమే మేలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల శ్రేయస్సు దృష్ట్యా పై తరగతులకు పంపించేందుకు పాస్ చేయడమే ఉత్తమమనే అభిప్రాయం మంత్రులు వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇంటర్ ప్రథమ పరీక్షలు రద్దు చేశారు. అదే రీతిలో ద్వితీయ పరీక్షలు రద్దు చేసి, ప్రథమ సంవత్సరం మార్కుల ఆధారంగా వేసి పాస్ చేయనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.