FbTelugu

ట్రంప్ తీరు ప్రజాస్వామ్యంపై దాడే: కెనడా ప్రధాని

ఒట్టావో: అగ్రరాజ్యం అమెరికాలో క్యాపిటల్ బిల్డింగ్ పై జరిగిన దాడిపై కెనడా ప్రధాని ట్రూడో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు కారకుడు ముమ్మాటికి అధ్యక్షుడు ట్రంప్ నే అని ఆరోపించారు.

డొనాల్డ్ ట్రంప్ అల్లర్లను రెచ్చగొట్టి హింసకు పాల్పడ్డారని అన్నారు. ఈ ఘటన ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ట్రూడో అభివర్ణించారు. ట్రంప్ తీరుపై ఇప్పటికే అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాలు సైతం విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.