FbTelugu

గ్రేట‌ర్‌లో క‌రోనా అదుపులోకి వ‌చ్చేనా!

కోటి జ‌నాభాలో ఇప్ప‌టికిప్ప డు వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే ఎంత‌మందికి క‌రోనా ఉన్న‌ట్టు తేలుతుంది. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం మ‌రో ముంబ‌యిగా మారే ప్ర‌మాదం ఉందా!

రాష్ట్ర‌ ప్ర‌‌భుత్వానికి కీల‌క ఆదాయ‌మార్గాలైన ఐటీ, ఫార్మా రంగాల ప‌రిస్థితి ఏమిటీ. రూ.80వేల కోట్లు వ్యాపార లావాదేవీలు జ‌రిగే నిర్మాణ‌రంగానికి వ‌ల‌స కార్మికులు ఆయువుప‌ట్టు.. 20 రాష్ట్రాల‌కు చెందిన సుమారు 15 ల‌క్ష‌ల మంది వ‌ల‌స కార్మికులు ఉన్న‌ట్టు అంచ‌నా. వీళ్లంతా సొంతూళ్ల‌కు వెళితే న‌గ‌రంలో ప‌నిచేసేవారుండ‌రు. ఇప్ప‌టికే ఐదారు ల‌క్ష‌ల మంది రోడ్లెంట ప్ర‌యాణం సాగిస్తున్నారు.

ఇటువంటి స‌మ‌యంలో కేసీఆర్ రేప‌టి ప్ర‌మాదాన్ని ఊహించి కూడా లాక్‌డౌన్ ఆంక్ష‌లు స‌డ‌లించారు. స‌రి, బేసి సంఖ్య‌ల పేరిట వ్యాపారాలు చేసుకోవ‌చ్చ‌ని చెబుతున్నా.. అది గ్రౌండ్ లెవ‌ల్లో ఎంత వ‌ర‌కూ విజ‌య‌వంతం అవుతుంద‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. జీహెచ్ఎంసీ ఒక్క తెలంగాణ‌కే కాదు.. యావ‌త్ దేశానికి ఆయువుప‌ట్టు. అటువంటి రాజ‌ధానిలో క్ర‌మంగా కేసులు పెరుగుతున్నాయి. వైద్య‌ప‌రీక్ష‌లు చేయిస్తే క‌నీసం 20శాతం కేసులు బ‌య‌ట‌ప‌డ‌తాయంటూ వైద్య‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

అయినా.. కేసీఆర్ మాత్రం ధైర్యం చేశారు. పైగా 17వేల బెడ్లు కూడా రెడీ చేశామంటున్నారు. అంటే.. ఆంక్ష‌లు స‌డ‌లించ‌టం వ‌ల్ల కేసులు పెరిగినా వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యేందుకు అవి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌నే సంకేతం కూడా కావ‌చ్చు. ఏమైనా.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌మాద‌క‌ర‌మైన క‌రోనా న‌గ‌రాల్లో హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, కర్నూలు కూడా ఉన్నాయ‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఏపీలో వైద్య‌ప‌రీక్ష‌ల‌తో ఎంతోకొంత క‌ట్ట‌డి చేస్తున్నా.. తెలంగాణ‌లో మాత్రం చూసీచూడ‌న‌ట్టు వ‌దిలేస్తున్నారు.

ఆసుప‌త్రుల్లో చికిత్స‌పొందుతున్న క‌రోనా రోగుల విష‌యంలోనూ నిబంధ‌న‌లు స‌డ‌లించారు. నెగిటివ్ రిపోర్టు రాగానే వెంట‌నే డిశ్చార్జి చేస్తున్నారు. క‌రోనా సోకిన కుటుంబాల్లోనూ కేవ‌లం ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి మాత్ర‌మే ప‌రీక్ష‌లు చేస్తున్నారు. చాలా మందికి ఇంటివ‌ద్ద‌నే హైడ్రోక్లోరోక్విన్ మందులు ఇచ్చి పోష‌కాహారంతో స‌రిపెడుతున్నార‌ట‌. ఏమైనా.. భ‌విష్య‌త్‌లో హైద‌రాబాద్ ప‌రిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉండ‌బోతుంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం.

You might also like