FbTelugu

నేను పార్టీ వీడటం లేదు: ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి

హైదరాబాద్: తను బీజేపీ పార్టీలో చేరుతున్న జరుగుతున్న ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డి ఖండించారు. సీఎం కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి వీర విధేయుడనని ఆయన తెలిపారు.

ఎమ్మెల్సీగా తన పదవీకాలం ఇంకా ఏడాది ఉందని, తానేమి గాబరాపడడం లేదని ఆయన అన్నారు. పార్టీలో చేరాలని తనను బీజేపీ నేతలు సంప్రదించలేదని, వారితోనూ చర్చలు కూడా జరపలేదన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో ఉంటున్నానని చిన్నప రెడ్డి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.