FbTelugu

మార్చి 3 నుంచి ప్రచారం: కమల్ హాసన్

చెన్నై: కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) నాలుగురాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూలు ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లో హీట్ మొదలైంది. ప్రాంతీయ పార్టీలు ప్రచారానికి సన్నద్ధమవుతున్నాయి

తమిళనాడు అసెంబ్లీలో తొలిసారిగా హీరో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం ఎన్నికల ప్రచారం తేదీని ప్రకటించారు. మార్చి 3వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. పొత్తుల విషయం ఖరారు కాగానే ఎక్కడెక్కడ ప్రచారం ఉంటుందనేది వివరంగా తెలియచేస్తానని కమల్ హాసన్ ఇవాళ మీడియాతో చెప్పారు. మార్చి 7న అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తానన్నారు. ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడులో ఒకే విడతో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కమల్ హాసన్ సిద్ధమయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.