FbTelugu

నేటితో ప్రచారాలు ముగింపు

హైదరాబాద్: గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల ప్రచారాలకు నేటితో ముగింపు కార్డు పడనుంది. ఇవాళ సాయంత్రం 6:00 గంటలతో ఎన్నికల ప్రచారం పూర్తిగా ముగియనుంది. 6:00 తర్వాత ఎలాంటి ప్రచారాలకూ అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) స్పష్టం చేసింది.

నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలుశిక్ష విధించనున్నట్టు హెచ్చరించింది. అలాగే రెండు రోజుల పాటూ.. మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్టు తెలిపింది. డిసెంబర్ 01 న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.. ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 04 న లెక్కింపు, ఫలితాలను వెల్లడించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.