FbTelugu

కార్చిచ్చుతో కాలిఫోర్నియా కకావికలం

వాషింగ్టన్ : అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాను కాలిఫోర్నియా కకావికలం చేస్తోంది. తీవ్రంగా వ్యాపించిన మంటలతో వేల ఎకరాల్లోని అడవులు అగ్నికి ఆహుతైపోతున్నాయి.

అనేక వన్యప్రాణులు సైతం ప్రాణాలు విడుస్తున్నాయి. రంగంలోకి దిగిన అధికారులు ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు  అధికారులు హెలికాప్టర్లను ఉపయోగించినప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదని తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ పైలట్ మృతి చెందినట్టు తెలిపారు.

You might also like