FbTelugu

ఇవాళ క్యాబినెట్ అత్యవసర భేటీ

హైదరాబాద్: ప్రగతి భవన్ లో ఇవాళ సిఎం కెసిఆర్ అధ్యక్షతన అత్యవసరంగా మంత్రి మండలి సమావేశం అవుతున్నది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ప్రధానంగా లాక్ డౌన్ సడలింపు, వానాకాలం సాగు పై చర్చించనున్నారు.
రాష్ట్రంలో ఈరోజు వరకు ఉన్న లాక్ డౌన్ ను పొడగించాలా సడలించాలా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ అంశంపై వైద్య ఆరోగ్య శాఖ సిఎం కెసిఆర్ కు నివేదిక అందచేసింది. ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో పంటల సాగుపై చర్చించనున్నారు. రైతులకు రైతు బంధు డబ్బులు విడుదల చేయడంతో ఎరువులు, విత్తనాలు అందుబాటులో పెట్టడం, నాణ్యమైన విత్తనాలు అందించడంపై దృష్టిపెట్టే అవకాశాలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.