FbTelugu

ఏపీ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం

అమరావతి: ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం తెలిపింది.

అలాగే మంత్రిమండలి 2019–20 సప్లమెంటరీ బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. 2020–2021 రాష్ట్రబడ్జెట్‌కు, 2020–2021 వ్యవసాయ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ యాక్ట్‌ –2020 కోసం ఉద్దేశించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించింది. ఆక్వాకల్చర్‌లో మానిటర్, ప్రమోట్, రెగ్యులేట్‌, డెవలప్‌మెంట్‌కోసం చట్టం రూపొందిస్తున్నారు.

You might also like