FbTelugu

బ్యాడిగ మిర్చీ రేటు అదుర్స్

బెంగళూరు: కర్ణాటకలో పేరు గాంచిన బ్యాడిగ మిర్చి ఎవరూ ఊహించని విధంగా అధిక  ధరకు అమ్ముడై రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనంతగా క్వింటాలుకు రూ.55,329 ధర లభించడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

రాష్ట్రంలో బ్యాడిగ మిర్చికు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి అని రైతులు అంటున్నారు. దీంతో హవేరి జిల్లా సిగ్గావి తాలుకా పనిగట్టి గ్రామానికి చెందిన చెన్నప్పగౌడ బలిగౌడ అనే రైతుకు లాభాల పంట పండిందనే చెప్పారు. రెండు క్వింటాళ్ల బ్యాడిగ మిర్చిని రికార్డు ధరకు విక్రయించి పంటలకు లాభం ఉంటుందని నిరూపించాడు. ఏహెచ్​ నసిపుర అనే వ్యక్తి ఈ ధరకు కొనుగోలు చేశాడు. గతవారం రూ.55,111 ఉన్న క్వింటా మిర్చి ధర ఉన్నపళంగా రూ.55,329కు పెరిగింది.

బ్యాడిగ మిర్చీ జీవితకాల గరిష్ఠానికి చేరుకుని రికార్డు ధర పలుకుతున్నది. ఈ మిర్చి నుంచి తీసిన ఆయిల్​ను నెయిల్​ పాలిష్,​ సౌందర్య లేపనాల తయారీలో పెద్ద ఎత్తున  ఉపయోగిస్తారు. ఔషధ గుణాలుండడంతో బ్యాడిగకు అంతర్జాతీయ మార్కెట్​లోనూ మంచి గిరాకీ​ ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.