FbTelugu

జగన్ ఆదేశించిన వెంటనే బస్సులు పునః ప్రారంభం

ఏపీ రవాణ మంత్రి పేర్నినాని

అమరావతి: సీఎం జగన్ రెడ్డి నుంచి ఆదేశాలు రాగానే బస్సులు ప్రారంభించేందుకు ఆర్టీసీ లో అన్ని ఏర్పాట్లు చేశామని ఏపీ రవాణ మంత్రి పేర్నినాని తెలిపారు.

రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల బస్సులు నడిపేందుకు అన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేశామన్నారు. సీఎం నుండి ఆదేశాలు వచ్చిన 24 గంటల్లో బస్సులు పునః ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్టీసీ టిక్కెట్ల బుకింగ్ లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. భౌతిక దూరం (ఫిజికల్ డిస్టాన్స్) పాటిస్తూ సీటింగ్ లో మార్పులు చేశామన్నారు.

పల్లె వెలుగు బస్సుల్లో మార్కింగ్ సిస్టం అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ తో బుక్కింగ్స్ అనుసంధానం చేస్తామన్నారు. ప్రతి బస్సులో యాంటీ వైరల్ స్ప్రే లు అందుబాటులో ఉంటాయని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.