FbTelugu

ఇప్పట్లో బస్సులు నడపరు

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ఇప్పట్లో నడిచేలా లేవు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం, టీఎస్‌ఆర్టీసీలో ఆపరేషన్స్‌ విభాగంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ తేలడంతో చర్చల్ని వాయిదా వేశారు. దీంతో ఇప్పట్లో ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపే పరిస్థితి కన్పించడం లేదు. ఈ నెల 17న విజయవాడలో ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ అధికారులు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు జరపాల్సి ఉంది.

తాజాగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు వాయిదా పడటంతో బస్సు సర్వీసులను నడిపే అంశంపై సందిగ్ధత నెలకొంది. కాగా, ఈ నెల 1 నుంచి 20 వరకు ఏపీఎస్‌ఆర్టీసీ రోజుకు సగటున 3,266 బస్సు సర్వీసుల్ని నడిపింది. గత 20 రోజులుగా రోజుకు రూ.2.43 కోట్లు ఆదాయం ఆర్టీసీ ఆర్జించింది. కరోనాకు ముందు రోజుకు రూ.12 కోట్ల ఆదాయం ఆర్టీసీకి వచ్చేది.

You might also like