FbTelugu

కాల్వలో పడ్డ బస్సు.. 45 కు చేరిన మృతులు

భోపాల్: బస్సు అదుపు తప్పి కాల్వలో పడిన ఘటనలో మృతుల సంఖ్య 45కి పెరిగింది. వీరిలో పురుషులు 24 మంది, మహిళలు 20 మంది, ఒకరు చిన్నారి ఉన్నారు. ఇవాళ ఉదయం సిద్ధి జిల్లాలోని పాట్నా గ్రామంలో చోటు చేసుకున్నది.

ఘటన జరిగిన తరువాత తొలుత 18మంది మృతదేహాలు బయటకు తీశారు. నీటి ప్రవాహం కారణంగా మిగతా మృతదేహాలు వెతికేందుకు ఇబ్బంది పడ్డారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిని నిలిపివేయడంతో మిగతావారి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధాని మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.