FbTelugu

లోయలో పడ్డ బస్సు

జకార్తా: జావా దివిలో బుధవారం అర్థరాత్రి యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 35 మందికి గాయాలు అయ్యయి.

వెస్ట్ జావాకు చెందిన ఇస్లామిక్ జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రకు స్పెషల్ బస్సులో బయలుదేరారు. బుధవారం అర్థారాత్రి సుమేడాంగ్ జిల్లాలో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగా అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 26 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 35 మంది కి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. బస్సులో నుంచి బాధితులను బయటకు తీసి దగ్గరలోని ఆసుపత్రికి అంబూలెన్స్ లలో తరలించారు. చనిపోయినవారి మృతదేహాలను వారి స్వంత ప్రాంతాలకు పంపించారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్థారణకు వచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.