FbTelugu

యడ్లపాడు హైవే పై కాలిన మృతదేహం

గుంటూరు: య‌డ్ల‌పాడు మండ‌లంలోని బోయ‌పాలెం- వంకాయ‌ల‌పాడు గ్రామాల మ‌ధ్య‌లో కాలి ఉన్న యువ‌కుడి శ‌వం లభ్యమైది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి ప‌రిశీలించారు.
బోయ‌పాలెం నుంచి వంకాయ‌ల‌పాడుకు వ‌చ్చే 16నంబ‌ర్ హైవే స‌ర్వీసు మార్గం ప‌క్క‌న చెత్త‌కుప్ప‌లో శ‌వం ఉన్న‌ట్లు గుర్తించారు. సుమారు 25 ఏళ్లు యువ‌కుడిగా పోలీసులు అంచ‌నా వేశారు. గోనె సంచుల‌లో శవాన్ని చుట్టి తెచ్చి, గుట్టు చ‌ప్పుడు కాకుండా ద‌‌‌గ్ధం చేసి ఉండోచ్చ‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

శవం 50శాతం కాలిపోగా, శ‌వానికి కొద్ది దూరంలో బెల్టు చెప్పులు ల‌భ్యమయ్యాయి. శవం తాలూకు ఆన‌వాళ్లు.. ఆధారాల కోసం గాలింపు చర్య‌లు చేపట్టారు. అనాధ శ‌వాన్ని ఇక్క‌డ ప‌డేశారా… యాచ‌కుడా లేక ఇత‌ర ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్క‌డ ద‌గ్ధం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొద‌టగా శవం ఎవ‌రిదీ అనే వివ‌రాల‌ను ఛేదించే దిశ‌గా పోలీసులు దృష్టి సారించారు. ఘ‌ట‌నా స్థ‌లంలో ఏ చిన్న ఆధారం దొరికినా పూర్తిస్థాయి విష‌యాల‌ను తెలుసుకుంటామ‌ని పోలీసులు చెబుతున్నారు

You might also like

Leave A Reply

Your email address will not be published.