FbTelugu

ఏజెన్సీలో దారి దోపిడీ దొంగలు బీభత్సం

విశాఖపట్నం: నర్సీపట్నం సిలేరు దారకొండ రోడ్డు మార్గంలో దారిదోపిడి దొంగలు గురువారం రాత్రి  కారుపై బీభత్సం సృష్టించారు. నర్సీపట్నం నుంచి దారకొండకు వేగంగా వెళుతున్న కారును దొంగలు ఆపడానికి ప్రయత్నించగా, ఇది గమనించిన కారు డ్రైవర్  ఆపకుండా ముందుకు పరుగెత్తించారు.

అయినప్పటికీ దోపిడి దొంగలు బెదరకుండా బైక్ లపై వాహనం వెంబడించారు. దొంగలు వెంటబడడంతో భయభ్రాంతులకు గురైన డ్రైవర్ వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. వెంటనే దాడి చేసి వారి వద్ద నుంచి  నగదు విలువైన సామానులు దొంగిలించారు. ఆ రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తున్న పలువురు ప్రమాదానికి గురైన   కారును చూసి విషయం తెలుసుకున్నారు. వెంటనే బైక్ లపై వారిని వెంబడించడానికి   ప్రయత్నించగా మార్గమధ్యలో ఒక బైక్ బోల్తాపడి గాయాలు అయినట్లు తెలిసింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.