FbTelugu

ప్రగతి భవన్ ఉద్యమ ద్రోహుల అడ్డా: బండి సంజయ్

వరంగల్: సిఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ద్రోహులకు అడ్డాగా మారిందని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వెంట ఉన్నవారు ఉద్యమకారులా? ద్రోహులా? అనే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో హుజూరాబాద్ నియోజకవర్గం కీలక పాత్ర పోషించిందని, ఇక్కడి నుంచే అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయన్నారు. ఇవాళ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు రాబోతున్నాయని అన్నారు.

టిఆర్ఎస్ కు నూకలు చెల్లే సమయం ఆసన్నమైందని, రాష్ట్రంలో బిజెపి బలపడుతోందన్నారు. ఉద్యమం ప్రారంభం నుంచి అహర్నిషలు పాటుపడిన ఈటల రాజేందర్ పరిస్థితే ఇలా ఉంటే మిగతా నాయకుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. రాజేందర్ విషయంలో కెసిఆర్ అత్యంత నీచంగా, సిగ్గు, లజ్జ లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు సరే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే పార్టీలో ఒక్కడు మిగలడన్నారు. గడీల పాలన తట్టుకోలేక బయటకు వచ్చినవారందరూ తెలంగాణ ద్రోహులా అని ఆయన నిలదీశారు. ఉప ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో మంత్రులు టి.హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ లు కోట్లాది రూపాయలు అప్పుడు వెదజల్లుతున్నారన్నారు. ఒక్క ఓటుకు రూ.20వేలు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బండి సంజయ్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.