FbTelugu

వ్యాక్సిన్ కోసం బంపర్ ఆఫర్లు…

హాంకాంగ్: కొన్ని దేశాల్లో వ్యాక్సిన్లు తీసుకునేందుకు జనం సిద్ధంగా ఉన్నా అవి దొరకడం లేదు. ఇస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా తీసుకునేందుకు కొన్ని దేశాల్లో పౌరులు ముందుకు రావడం లేదు.

ఈ నేపథ్యంలో హాంకాంగ్ లో వ్యాక్సిన్ తీసుకుంటే బంగారం, ఐ ఫోన్లు ఇస్తామని కొన్ని సంస్థలు ప్రకటించాయి. వీటితో పాటు టెస్తా కార్లు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన గుడ్ మ్యాన్ గ్రూప్ అయితే ఆగస్టు 31వ తేదీ లోపు వ్యాక్సిన్ తసుకుంటే లాటరీలో పేరు చేర్చుతామని ప్రకటించింది. షాపింగ్ వోచర్లు, మధ్య తరగతి ప్రజల కోసం సబ్సిడీ ఆఫర్లు పలు సంస్థలు ప్రకటించాయి. ఇలాంటి ప్రకటనల విలువ సుమారు 12 కోట్ల హాంకాంగ్ డాలర్లుగా ఉంటుందని హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యుటివ్ క్యారి లామ్ వెల్లడించారు. ప్రజల్లో వ్యాక్సిన్ పై నమ్మకం కలిగించడంతో పాటు వైరస్ బారి నుంచి రక్షించేందుకే ఇలాంటి ఆఫర్లు ప్రకటించారంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.