FbTelugu

తీవ్రమవుతున్న బుల్ బుల్ తుఫాను

Bulbul-storm-intensifies

పోర్టులకు రెండు, మూడు ప్రమాద హెచ్చరికలు

విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్‌బుల్‌ తీవ్ర తుపాను గా రూపాంతరం చెందింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు 740 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉండంతో ఏపీలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది. ఈ నెల 9వ తేదీ ఉదయం వరకు ఉత్తర దిశగా పయనించనుంది. ఆ తర్వాత దిశను మార్చుకుని ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని ఐఎండి పేర్కొన్నది. బుల్‌బుల్‌ తీవ్రరూపం దాలుస్తుండడంతో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసి, కళింగపట్నం, భీమునిపట్నం పోర్టులకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

You might also like