FbTelugu

అడ్రస్ మారిన ఇంటి ముందు జనం సెల్ఫీలు

వాషింగ్టన్: భారత దేశంలో మనం ఇళ్లను కొన్ని ఇంచులు లేదా అడుగులు ఎత్తడం, సరి చేయడం చూశాం. దిగువకు ఉన్న ఇళ్లను పైకి లేపడం చూస్తున్నాం. అమెరికాలో మాత్రం ఏకంగా ఒక ఇంటిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించారు.
అత్యంత ఖరీదైన ఇంటికి, భారీ మొత్తం వెచ్చించి తరలించిన ప్రక్రియ ప్రపంచ చరిత్రలో రికార్డు సృష్టించింది. సాధారణంగా వ్యక్తులు ఇళ్లు మారినప్పుడు మాత్రమే ఇంటి చిరునామా మారింది. కాని ఇక్కడ ఇళ్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలివెళ్లడంతో అడ్రస్ మారింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫ్రాంక్లిన్ స్ట్రీట్ లో 807 అనే 139 ఏళ్ల పురాతన భవనం ఉంది. పురాతన విక్టోరియా భవనం ఆరు వీధులకు అవతల ఉన్న ఫుల్ స్ట్రీట్ కు తరలించారు. దీంతో భవనం అడ్రస్ మారిపోయింది. అయితే ఈ భవనం తరలింపు క సం రూ.3 కోట్లు యజమాని చెల్లించాడు.

ఆరు బెడ్ రూమ్ లు, అందమైన కిటికీలు, చూడచక్కని ముఖ ద్వారం కలిగిన రెండంతస్తుల భవనాన్ని తరలించేందుకు యజమాని టిమ్ బ్రౌన్, ఫిల్ రామ్ ను సంప్రదించాడు. భవనం తరలింపుకోసం నెలల తరబడి ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం మొత్తం 15 ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి తీసుకున్న తరువాతే పని మొదలు పెట్టారు. భారీ ట్రాలీపై గంటకు ఒక మైలు వేగంతో ఈ భవనాన్ని అత్యంత సురక్షితంగా తరలించారు. అయితే ఎలాంటి ఆటంకం లేకుండా తరలించి షెహబాష్ అనిపించుకున్నారు. కాగా, ఈ భవనం ట్రాలీపై తరలించే క్రమంలో జనం ఎగబడ్డారు. భవన ముందు నిల్చుని సెల్ఫీలు తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.