FbTelugu

వచ్చే నెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు

అమరావతి: మార్చి నెల 15వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. నెల రోజులపాటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలు ప్రారంభమైన వారం పది రోజుల్లో 2020-21 సంవత్సర బడ్జెట్ ఆమోదించి.. ఆ తర్వాత వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్ట ఉప సంహరణ బిల్లుల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నది. స్థానిక ఎన్నికల్లో సంస్కరణలు తెచ్చేలా పీఆర్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More