FbTelugu

ఊళ్ల పేర్లు కూడా ఉంచవా ?: బుద్ధా వెంకన్న

* జగన్ పై ట్విట్టర్ లో బుద్దా వెంకన్న ఫైర్
అమరావతి: పైశాచికత్వంతో ఊళ్ల పేర్లు కూడా ఉంచరా అంటూ.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మరో మారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల ఏపీలో మరిన్ని పట్టణ స్థానిక సంస్థలు ఏర్పాటు చేస్తున్నారని..

విజయవాడలో కొత్తగా వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆ కథనంలో పేర్కొంటూ.. మీడియాలో వచ్చిన ఓ కథనంపై ఆయన స్పందించారు. ‘వైఎస్సార్ తాడిగడప ఏంటి ? నీ పైశాచికత్వానికి ఊళ్ల పేర్లు కూడా ఉంచవా? బ్రదర్ అనిల్ విజయవాడ, సిస్టర్ షర్మిల గుంటూరు, విజయమ్మ ఆంధ్రప్రదేశ్ అని కూడా మార్చిపడేయ్ !’’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.