FbTelugu

ఆ లేఖకి సమాధానం చెప్పే దమ్ములేదా ?: బుద్దా

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణంరాజు కు ఇచ్చిన షోకాజ్ నోటీస్ (లేఖ)పై సమాధానం చెప్పే దమ్ము విజయసాయి రెడ్డికి లేదా అంటూ టీడీపీ సీనీయర్ నేత బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో పలు వ్యాఖ్యలు చేశారు.

విజయ సాయిరెడ్డి ఉడత ఊపులు ఆపండి అంటూ ఎద్దేవా చేశారు. ‘‘ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి అయిన మీకు యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీ గారు షో కాజ్ నోటీసు లాంటింది పంపినట్టు ఉన్నారు. ఆ లేఖ కి సమాధానం చెప్పే దమ్ములేదా? అబ్బా సాయిరాం’’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like