FbTelugu

జగన్… ఇదేమి దోపిడి: ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు.

వామ్మో ఈ దోపిడీ ఏంటి జగన్ రెడ్డి గారు? బాబు గారు తన సొంత ఖర్చులతో హిమాలయా వాటర్ బాటిల్ తెచ్చుకుంటేనే గోల గోల చేసారు.. ఇప్పుడు ప్రజాధనంతో మీరు చేస్తున్న దుబారాకి ఎం సమాధానం చెబుతారు?.

విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న జగన్ రెడ్డి వాటర్ బాటిల్, మజ్జిగ ప్యాకెట్ ల కోసం రూ.43.44 లక్షలు స్వాహా చేశారు. జగన్ గారి ప్రమాణ స్వీకారానికి ఇప్పటికీ డబ్బులు విడుదల చేస్తూనే ఉన్నారు. వాటర్ బాటిల్స్, స్నాక్స్ కోసం రూ.59.49 లక్షలు స్వాహా అని ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.