FbTelugu

కడప జిల్లాపై ప్రత్యేక నిఘా పెట్టాలి: బీటెక్ రవి

అమరావతి: కడప జిల్లాపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కోరారు. ఇవాళ ఎస్ఈసీని టీడీపీ శ్రేణులు కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పంచాయతి ఎన్నికల్లో చాలా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని, ఏకగ్రీవాల కోసం వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని తెలిపారు.

పోలీసులు కూడా గతంలో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారని అన్నారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండాలని కోరినట్టు తెలిపారు. జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతామని ఈసీ హామీ ఇచ్చారని తెలిపారు. నిమ్మగడ్డ ను కలిసిన తర్వాత ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం కలిగిందన్నారు. ఎమ్మెల్సీకి గన్ మెన్ లేకుండా చేయడం దౌర్భాగ్యకరమన్నారు. గన్ మెన్ లేకుండా చేసి తనని చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎస్ఈసీని కలిసిన వారిలో లింగారెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.