FbTelugu

‘‘అపూర్వ సహోదరుల’’ శకం ముగిసింది

వాషింగ్టన్: ప్రపంచ టెన్నిస్ చరిత్రలో అపూర్వ సహోదరుల శకం ముగిసిందనే చెప్పాలి. సొంత గడ్డపై జరిగే యూఎస్ ఓపెన్ నుంచి వీరు తప్పుకోవడంతో ఇక ఆటకు గుడ్ బై చెప్పిననట్లేనని అర్థమవుతోంది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పురుషుల డబుల్స్ లో 16 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ జోడిగా బ్రియాన్ బ్రదర్స్ గెలుచుకున్నారు. ఏ కోర్టు అయినా సరే వారు అదరకుండా బెదరకుండా రఫాడించేవారు. పెద్దవాడు మైకెల్ కార్ల్ బ్రియాన్, చిన్నవాడు రాబర్ట్ చార్లెస్ బ్రియాన్. ఇద్దరి మధ్య రెండు నిమిషాలే వ్యత్యాసం. ఇద్దరు కవల పిల్లలు.

యూఎస్ ఓపెన్ లో తొలిసారి 1995 లో ఈ అపూర్వ సోదరులు బరిలోకి దిగారు. 2003 లో ఈ జంట ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజయం సాధించడంతో కీలక మలుపు తీసుకున్నది. ఆ ప్రస్థానం 16 గ్రాండ్ స్లామ్ సాధఇంచే స్థాయి వరకు కొనసాగింది. 2020 తమకు చివరి సీజన కానున్నదని బ్రియాన్ సహోదరులు గతేడాది చివరలో ప్రకటించారు. అన్నట్లుగానే తప్పుకుంటున్నారు.

 

You might also like