FbTelugu

బాలున్ని కిరాతకంగా కొట్టిన కానిస్టేబుల్ పై వేటు

న్యూఢిల్లీ: ఓ బాలున్ని నడిరోడ్డుపై ఓ కానిస్టేబుల్ విచక్షణా రహితంగా కొట్టడంతో సదరు కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకెళితే.. దేశ రాజధానిలో నడిరోడ్డుపై ఓ బాలున్ని ఓ కానిస్టేబుల్ కర్రతో కొడుతుండగా.. ఆ బాలుడు కొట్టొద్దని ఎంతలా ప్రాదేయపడినా వినకుండా కొడుతూనే ఉన్నాడు.

ఈ తతంగాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. స్పందించిన పై అధికారులను వెంటనే ఆ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.

You might also like