FbTelugu

అమ్మాయిని ఎరగావేసి హత్య

తూర్పుగోదావరి: భూ తగాదాలతో వరుసకు సోదరుడైన వ్యక్తికి అమ్మాయిని ఎరగా వేసి హత్య చేసిన ఘటన జిల్లాలోని ముమ్మిడివరం మండలం, చెయ్యేరు గున్నేపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. శ్రీనివాస్ ప్రసాద్(నిందితుడు) అనే వ్యక్తి తన పెదనాన్న కొడుకు రామకృష్ణకు మధ్య భూతగాదాలు ఏర్పడ్డాయి. దీంతో శ్రీనివాస్ ప్రసాద్ ఓ అమ్మాయిని ఎరగా వేసి రామకృష్ణను గత ఏడాది హత్య చేశాడు.

అనంతరం మృతదేహాన్ని కరప మండలం అరట్లకట్ట దగ్గర పడేశాడు. అదే యువతితో రామకృష్ణ తల్లిదండ్రులకు ఫోన్ చేయించి తాము పెళ్లి చేసుకున్నామని తిరుపతిలో ఉన్నామంటూ పలుమార్లు ఫోన్ చేయించాడు. రామకృష్ణ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి కాల్ డేటా ఆధారంగా ఆ యువతిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. భూ తగాదాలతోనే శ్రీనివాస్ ప్రసాద్ తన సోదరుడైన రామకృష్ణను హత్యచేసినట్టుగా వెల్లడైనట్టు తెలిపారు.

You might also like