FbTelugu

బాలుడి దారుణ హత్య

చిత్తూరు: కుప్పం మండలం చిగల పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకున్నది. 7సంవత్సరాల బాలుడిని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు.
గ్రామ శివార్లలోని జొన్నతోటలో అత్యంత కిరాతకంగా హతమార్చిన దుండగులు, ఆ తరువాత మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు చిగలపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు వెంకటాచలపతి గా గుర్తించారు. దారుణ హత్యతో గ్రామంలో విషాదం నెలకొన్నది. ఘటనా స్థలికి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని విచారం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.